ఐఎస్సి(కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్) క్లాస్ 12 వ పరీక్షా ఫలితాలను ప్రకటించారు. నిన్న ప్రక్కటించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో వారి ఫలితాలను cisce.org లేదా results.cisce లో చెక్ చేసుకోవచ్చు అని అధికారులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మొత్తం 96.84% విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని అధికారులు పేర్కొన్నారు. 

 

ఈ ఏడాది ఐఎస్‌సి బోర్డు పరీక్షలో మొత్తం 88,409 మంది విద్యార్థులు హాజరయ్యారని... అందులో 85,611 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వివరించారు. ఈ సంవత్సరం, మొత్తం 1125 పాఠశాలల విద్యార్థులు ఈ పరిక్షలకు హాజరయ్యారి. ఫలితాలను ప్రకటించిన 48 గంటల తర్వాత CISCE డిజిటల్ సంతకం చేసిన మార్క్‌షీట్‌ను అందిస్తుందని అధికారులు పేర్కొన్నారు. మార్క్ షీట్ కోసం స్కూల్ కి వెళ్ళాల్సిన అవసరం లేదని ఆన్లైన్ లో పొందవచ్చని చెప్పారు. 
+

మరింత సమాచారం తెలుసుకోండి: