తెలంగాణలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో సంస్కరణ లు చేస్తూ వస్తున్నారు కేసీఆర్.  ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రస్తుత సచివాలయం కూల్చివేసి కొత్త సచివాలం ఏర్పాటుకు సిద్దమయ్యారు. కొత్త సచివాలయం నిర్మించేందుకు పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సచివాలం కూల్చి వేత సందర్భంగా మసీదు, ఆలయాలు కూడా కూల్చివేయడంపై విచారం వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన చేసింది. 

 

ఎవరి మనసు నొప్పించడం తమ అభిమతం కాదని.. అది తెలంగాణ సంస్కృతి కాదని.. కూల్చి వేసే సమయంలో జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తూ.. వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తామని అన్నారు.  ఈ ప్రకటనపై స్పందించిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దీనిపై యునైటెడ్ ముస్లిం ఫోరమ్ త్వరలో సవివరంగా ప్రకటన చేస్తుందని వెల్లడించారు.

 

కొత్త సచివాలయంతో పాటే మసీదు, ఆలయ నిర్మాణాలు కూడా కొత్తవి చేపడతామని, ఇది తన హామీ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని అసదుద్దీన్ వివరించారు. అంతే కాదు తెలంగాణ ఒక లౌకికవాద రాష్ట్రమని, ఇక్కడ అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉంటారని.. మసీదు, మందిరం కూల్చివేత ఊహించనిరీతిలో జరిగిపోయిందని సీఎం విచారం వ్యక్తం చేశారని, దీన్ని రాగద్వేషాలకు అతీతంగా చూడాలంటూ ఆయన అభ్యర్థించారని పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: