అభివృద్ది చెందడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన భీమిలి నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమ౦లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. రాబోయే రోజులలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయనారు. విశాఖ నగరం 2019 కి ముందు, ఆ తర్వాత అన్న తేడాలను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. 

 

 ఎయిర్ పోర్టు, మూడు పోర్టులు, రైల్వే డివిజన్ ఇలా అన్ని వసతులు ఉన్న నగరం విశాఖ పట్నం అని ఆయన పేర్కొన్నారు.  అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామని ఆయన చెప్పుకొచ్చారు. పూర్తి స్ధాయి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామన్నారు ఆయన. సిఎం జగన్ గత ఏడాది విశాఖ నగరంలో రూ.1000 కోట్ల పైన అభివృద్ది పనులకి శ్రీకారం చుట్టారన్ని గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: