కరోనా మహమ్మారి తమిళనాడులో విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో కూడా ఇక్కడ ఎక్కువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అన్‌లాక్‌ 1.0 తర్వాత.. రోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత ఎక్కువగా తమిళనాట కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా తమిళనాడులో మరో మంత్రికి కరోనా సోకింది. ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూర్ కె. రాజుకు శుక్రవారం కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయ్యింది.

 

దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఆయన అడ్మిట్ అయ్యారు. తమిళనాడులో ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు కరోనా బారినపడ్డారు. జూన్ 18న ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పి. అన్బాలగన్‌కు కరోనా సోకింది. జూలై 8న విద్యుత్ శాఖ మంత్రి పి.తంగమణికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందారు.

 

మంత్రి సెల్లూర్ కె. రాజుకు నాలుగు రోజుల కిందట మంత్రి భార్యకు కరోనా సోకడంతో గురువారం ఆయనకు కూడా పరీక్షలు జరిపారు. దీంతో సెల్లూర్ రాజుకు కూడా కరోనా సోకినట్లు తెలిసింది. తమిళనాడులో ఇప్పటి వరకు 1.22 లక్షల మందికి వైరస్ సోకగా 1700 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: