భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపధ్యంలో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాద్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశం అయ్యారు. ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో నెలకొన్నపరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించారు. అక్కడి పరిస్థితిని నేరుగా అడిగి తెలుసుకున్నారు. 

 

ఆర్మీ చీఫ్ నరవాణే, నేవీ చీఫ్ కరంవీర్ సింగ్, వాయుసేన చీఫ్ బధూరియాతో  సా పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గాల్వాన్ వ్యాలీ సహా గోర్గా వంటి ప్రాంతాల నుంచి చైనా బలగాలు వెనక్కు తగ్గడంపై ఒక రిపోర్ట్ ని భారత ఆర్మీ అధికారులు రాజనాథ్ కి సమర్పించారు. ఇక రాజనాథ్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విష్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: