కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆర్ధికంగా నానా రకాల బాధలు పడుతుంది. ఇక అమ్మకాలు లేని సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు ప్రతీ రూపాయి ని జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే మొబైల్ కంపెనీలు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. అది ఏంటీ అంటే...

 

ఇప్పటి వరకు మొబైల్ తో పాటు చార్జర్ ఇచ్చే వారు. అయితే ఇక నుంచి చార్జర్ లేకుండానే మొబైల్ ఫోన్స్ ని కంపెనీలు విక్రయించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి మొబైల్ కంపెనీలు చార్జర్ లేకుండా ఫోన్స్ ని విడుదల చేస్తాయి. యాపిల్ 12 లో చార్జర్ ఇయర్ ఫోన్స్ లేకుండా  విడుదల చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. స్యామ్సంగ్ కూడా అదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: