ఈ లాక్ డౌన్ సమయంలో చాలా వరకు కూడా ఇప్పుడు అడవి జంతువులు బయటకు వస్తున్నాయి. వాటిని కట్టడి చెయ్యాలని చూసినా సరే అడవుల నుంచి బయటకు రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఒక చిరుత పులి కంగారు పెట్టింది అధికారులను.

 

ఇండోర్‌ లోని కంపెల్ గ్రామ సమీపంలో అటవీ శాఖ అధికారులు గాయపడిన చిరుతపులిని పట్టుకున్నారు. ఒక ఫారెస్ట్ రేంజర్ దీని గురించి మాట్లాడుతూ అక్కడి సంఘటనను మీడియాకు వివరించారు.  "చిరుత పులి మరొక చిరుత పులితో గొడవ కారణంగా తీవ్రంగా గాయపడిందని పేర్కొన్నారు. మా బృందం ఆ చిరుతను పట్టుకుని వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళిందని వివరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: