కోవిడ్-19 ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి మేఘాలయ సిఎం వార్నింగ్ ఇచ్చారు. కరోనా నివారణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక దూరం పాటించకుండా ఉండటంతో పాటుగా కీలకమైన మాస్క్ లు లేని వారికి బహిరంగంగా ఉమ్మి వేయడం వంటివి చేసిన వారికి కఠినం గా శిక్షలు ఉంటాయి అని ఆయన స్పష్టం చేసారు. కచ్చితంగా జరిమానా 500 విధిస్తామని ఆయన స్పష్టం చేసారు. 

 

మొదటిసారి ఉల్లంఘించినవారికి రూ .500 జరిమానా విధించబడుతుందని, పదేపదే చేసిన నేరానికి జరిమానా రూ .1,000కి ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ప్రజలు ప్రోటోకాల్‌ను పాటించేలా చూడాలన్న ఆయన... ఇవి మీ కుటుంబాన్ని రక్షించడానికి సహాయపడే సాధారణ నియమాలు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: