కరోనా దెబ్బకు ఇప్పుడు విద్యార్ధులు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు అనే చెప్పాలి. ఇక వారు ఇప్పుడు పరిక్షల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అర్ధం కాక అవస్థలు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా మహమ్మారి సమయంలో  పరిక్షలు వద్దు అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి డిమాండ్ చేసారు. 

 

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కి ఒక విజ్ఞప్తి చేసారు. పరీక్షలు రద్దు చేసి, విద్యార్థుల గత ప్రతిభ ఆధారంగా వారిని ప్రమోట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. విద్యార్థులు, విద్యా వేత్తల అభిప్రాయాలను యూజీసీ తప్పనిసరిగా వినాలని ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌తో ప్రజలెంతో నష్ట పోయారని... స్కూళ్లు, పాఠశాలలు, యూనివర్శిటీ విద్యార్థులు కూడా ఇబ్బందులకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: