ఈ మద్య తెలంగాణలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తుంది.  తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు, మరికొందరు ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతుండటం తెలిసిందే.  వారితో పాటు కుటుంబ సభ్యులు, గన్ మెన్, ఇతర సిబ్బంది కూడా కరోనా వైరస్ భారిన పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కరోనా బారిన పడిన ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి దంపతులు కోలుకొని శుక్రవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘మీ దీవెనలతో కరోనాను జయించాం. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని.. లేని పోని పుకార్లు విని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని.. సరైన చికిత్స తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావొచ్చిన.. అలాగే మనం సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పకుండా వాడాలని అన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిత్యం ప్రజలతో గడుపుతూ తమ వంతు సహకారంగా నిత్యావసరాలు, మాస్కులు పంపిణీ చేశామన్నారు.

 

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆశీస్సులు, ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,  ప్రజల దీవెనలతో కరోనాను జయించామన్నారు. అందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: