స్టువర్ట్ బ్రాడ్... ఇంగ్లాండ్ జట్టులో అత్యంత కీలకమైన బౌలర్. జట్టు ఏ పరిస్థితిలో ఉన్నా సరే తన మార్క్ బంతులతో అతను వేసే ఇన్, అవుట్ స్వింగర్లు, స్లో గా వచ్చి తాకే బౌన్సర్లు  ప్రత్యర్ధిని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంగ్లాండ్ పేస్ ద్వయం అనగానే అండర్సన్, అతని పేర్లే వినపడుతూ ఉంటాయి. అయితే విండీస్ తో జరిగే మొదటి టెస్ట్ లో తనను తీసుకోకపోవడంపై అతను అసహనం వ్యక్తం చేసాడు. 

 

తొలి టెస్ట్ లో తనను బెంచ్ కి పరిమితం చెయ్యాలి అనే ఇంగ్లండ్ నిర్ణయంతో తాను నిరాశకు గురయ్యానని, కోపంగా ఉన్నానని, తన అంతర్జాతీయ భవిష్యత్తు గురించి జాతీయ సెలెక్టర్ ఎడ్ స్మిత్‌తో చర్చలు  జరపాలని భావిస్తున్నా అని  బ్రాడ్ అన్నాడు. తనను జట్టులోకి తీసుకోకపోతే ఏం చేస్తానో ఇంగ్లాండ్ కి తెలుసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: