న‌కిలీ పైలట్ లైసెన్సుల వివాదం పాకిస్థాన్‌ను వెంటాడుతోంది. ఇప్పటికే ఐరోపా సమాఖ్య.. పాకిస్థాన్ అంత‌ర్జాతీయ విమానసంస్థ- పీఐఏపై నిషేధం విధించగా.. అమెరికా కూడా అదేబాటలో పయనించింది. పాకిస్థాన్ నుంచి అమెరికాకు న‌డిచే పీఐఏ చార్టర్‌ విమానాల అనుమ‌తిని ర‌ద్దుచేస్తున్నట్లు యూఎస్ డిపార్డ్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పొర్టేష‌న్ ప్రక‌టించింది.పాకిస్థాన్‌లో స‌గానికిపైగా పైలట్ లైసెన్సులు న‌కిలీవ‌ని తేల‌డం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప‌లుదేశాలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి.

 

 


 పాకిస్థాన్‌లో ఇప్పటివరకు జారీ అయిన పైలట్ లైసెన్సుల్లో ఎక్కువశాతం చెల్లనివని అక్కడి ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. దేశంలో 860 క్రియాశీల పైలట్ లైసెన్సులుండగా వీటిలో దాదాపు 262 లైసెన్సులు సందేహాస్పదంగా ఉన్నాయని తేలింది. దీనిపై పాకిస్థాన్‌ పార్లమెంటులోనూ చర్చ జరిగింది. కేవలం పాకిస్థాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థలోనే మూడోవంతు పైలట్లు తప్పుడు విధానంలో లైసెన్సులు పొందినట్లు ద‌ర్యాప్తులో వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: