నేపాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వానల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురికి గాయాలయ్యాయి.
ఖాస్కీ జిల్లా సారంగ్​కోట్​ ప్రాంతం పోఖారాలో కొండచరియలు పడి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మరో పది మందికి గాయాలవ్వగా.. వారిని ఆసుపత్రులకు తరలించారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు.

 

గత48 గంటలుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాల కారణంగా దేశంలోని నారాయణి, ఇతర ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో 72 గంటల పాటు ఇలాగే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: