ఆనంద్‌ దేవరకొండ తొలి సినిమా 'దొరసాని'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అలరించాడు. విజయ్‌ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్‌ నటన ఆకట్టుకుంది. తాజాగా అతడు భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మితమయ్యే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది చిత్రబృందం.

 

 

ఈ చిత్రానికి 'మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్' అనే టైటిల్ ఖరారు చేశారు. వినోద్‌ అనంతోజ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో వర్షా బొల్లమ్మ కథానాయికగా నటిస్తోంది. భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి 'కేరాఫ్‌ కంచరపాలెం' ఫేమ్‌ స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: