ఉత్తరప్రదేశ్​లో కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ 'మూడు రోజుల ప్రణాళిక'ను అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులే నేరుగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికీ యాంటిజెన్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు యోగి. ఈ కార్యక్రమంలో ప్రజలకు వైరస్​పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు.

 

కరోనా పరీక్షలను అధిక సంఖ్యలో నిర్వహించేందుకు ల్యాబ్ సిబ్బందిని కూడా పెంచినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాబట్టి ప్రతి రోజు 15 వేల రాపిడ్​ యాంటీజెన్​ పరీక్షలను నిర్వహించాలని నిర్దేశించారు. పరీక్షల సమయంలో కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా ప్రతి చోట శానిటైజ్​ చేయాలని అధికారులకు సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: