చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగతున్న వేళ భారత అమ్ములపొదిలోకి మరో ఐదు అపాచీ హెలికాప్టర్లు చేరాయి. అమెరికాకు చెందిన బోయింగ్​ సంస్థ ఒప్పందంలో భాగంగా ఇవ్వాల్సిన 22 హెలికాప్టర్లలో తుది ఐదింటిని భారత వైమానిక దళానికి అందించింది.
ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున.. కొత్త వాటినీ అదే ప్రాంతంలో మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు.

 


 22 అపాచీ, 15 చినూక్​ హెలికాప్టర్ల కొనుగోలు కోసం 2015 సెప్టెంబర్​లో బోయింగ్​ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్.కొత్తగా 5 హెలికాప్టర్ల రాకతో... ఒప్పందం ప్రకారం అందించాల్సిన 22 అపాచీ, 15 చినూక్​ సైనిక హెలికాప్టర్ల డెలివరీ పూర్తయినట్లు తెలిపారు బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఎండీ సురేంద్ర అహుజ.ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక బహుళ ప్రయోజనకర యుద్ధ హెలికాప్టర్లలో ఏహెచ్​-64ఈ అపాచీ ఒకటి. ఇప్పటికే అమెరికా సైన్యంలో వినియోగంలో ఉంది. చినూక్​ అనేది బహుళ పాత్ర పోషించే, ఉన్న చోటి నుంచే గాల్లోకి ఎగరగల సామర్థ్యం ఉన్న హెలికాప్టర్. వీటిని ప్రధానంగా బలగాలు, యుద్ధ సామగ్రి, ఇంధనాన్ని రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు.ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత పర్యటనలో భాగంగా మరో 6 అపాచీ హెలికాప్టర్ల కోసం ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: