కేరళలో రాజకీయ చర్చలు రేపిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్​ కుంభకోణం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)  ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది . ముఖ్యంగా ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్​​తో పాటు సందీప్ నాయర్,ఫజిల్​ ఫరీద్,  సరిత్ పై చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం కింద అభియోగాలు మోపింది.రూ.14.8 కోట్లు విలువైన బంగారం స్మగ్లింగ్ కేసును ఎన్​ఐఏకు బదిలీ చేసింది కేంద్ర హోంశాఖ.

 

ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కేరళ హైకోర్టును స్వప్న ఆన్లైన్ ద్వారా ఆశ్రయించింది . ఆమెకు బెయిల్​ ఇవ్వొద్దని కోర్టును ఎన్​ఐఏ శుక్రవారం కోరింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ) కింద కేసు నమోదైనట్లు పేర్కొంది. బంగారం స్మగ్లింగ్​లో ఆమె పాత్ర గురించి తెలియాలంటే విచారించేందుకు రిమాండ్​కు తరలించాల్సిన అవసరముందని న్యాయస్థానానికి వివరించింది.ఈ కేసుతో స్వప్నకు సంబంధముందని రుజువు చేసేందుకు మరో నిందితుడు సరిత్​, సందీప్​ నాయర్ భార్య వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు కేంద్రం తరఫు న్యాయవాది.వాదనలు విన్న అనంతరం ఈ కేసులో అరెస్టు నుంచి స్వప్నకు మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరించారు న్యాయమూర్తి జస్టిస్​ అశోక్ మేనన్​.

మరింత సమాచారం తెలుసుకోండి: