కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ట్విట్టర్ వేదికగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ  ప్రెసిడెంట్ బండి సంజయ్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2019 సాధారణ ఎన్నికలలో బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేసిన బండి సంజయ్ ఆర్ ఎస్ ఎస్ ఈ విభాగం నుంచి భారతీయ జనతా పార్టీలోకి అడుగులు వేశారు.

 

2019 ఎన్నికలలో టిఆర్ఎస్ హవా అత్యధికంగా నడుస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో గడ్డు కాలం గా చెప్పుకోవచ్చు. అదే సమయంలో టిఆర్ఎస్ పార్టీ కూటమి దిశగా అడుగులు వేసి భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. అలాంటి సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కరీంనగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ గెలిచారు. సంజయ్ మొదట అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి ఆర్ఎస్ఎస్ కు చేరుకొని అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ దిశ గా అడుగులు వేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: