ఈ సంవత్సరం 2020 మరీ దారుణంగా తయారైంది. ప్రకృతి బీభత్సవం ఓ వైపు.. కరోనా వైరస్ మరోవైపు. మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే.. ఆర్థికంగా భారీగా నష్టాలు జరుగుతున్నాయి. తాజాగా సరిహద్దు దేశం నేపాల్ ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 12మంది మరణించగా..18 మంది అదృశ్యమయ్యారు.  వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయక చర్యలను అందించడంలో నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ) నేతలు నిమగ్నమయ్యారు. 

 

ఈ మద్యనే నేపాల్ లో రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడింది.  ఇది ఓ వైపు జరగుతూనే ఉంది.. మరోవైపు తుఫాన్లు, భూకంపాలు.. భారీ వర్దలు.. కరోనా తో నేపాల్ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కొండ చరియలు విరిగిపోవడం..  గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండా చర్యలు విరిగి పడుతున్నాయి. 

 

ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజకీయ భవితవ్యాన్ని తేల్చేందుకు శుక్రవారం జరుగుతుందని భావించిన కీలక సభ్యుల సమావేశం వారం పాటు వాయిదా పడింది. కాగా, ఈ విషయం ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నారాయణ్‌ కాజీ శ్రేష్ఠ మీడియాకు తెలిపారు. ఈ సమావేశం వాయిదా పడటం ఇది వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: