భారత్ లో కరోనా పరీక్షలను రోజు రోజుకి వేగవంతం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలు కూడా కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో ఇప్పుడు కాస్త జాగ్రత్త పడుతున్నాయి అనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా పరిక్షలు కోటి మందికి పైగా చేసిన సంగతి తెలిసిందే.

 

 దేశ వ్యాప్తంగా జూలై 10 వరకు 1,13,07,002 నమూనాలను పరీక్షించారని ఐసిఎంఆర్ ప్రకటించింది. వీటిలో 2,82,511 నమూనాలను నిన్న పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. మహారాష్ట్ర ఏపీలో కరోనా పరీక్షలను వేగంగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ లో కూడా ప్రతీ రోజు 30 వేలకు పైగా కరోనా పరీక్షలను చేస్తున్నారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో పరిక్షల సంఖ్యను పెంచే ఆలోచనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: