కరోనా నివారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సారించి వాటి నిర్వాహణ కోసం ప్రతి జిల్లాకి కోటి రూపాయలు కేటాయించిందని కరోనా నియంత్రణకు సంబంధించిన నోడల్ అధికారి కృష్ణ బాబు వివరించారు. ఈ మొత్తాన్ని వైద్య పరికరాలు, సౌకర్యాలకు వాడతారని ఆయన అన్నారు. 

 

వాటి కేంద్రాలను జేసీ లు పర్యవేక్షిస్తారు అని కోవిడ్ వైద్యం కోసం సెంటర్స్ లో పడకల సంఖ్య 5 వేలకు పెంచాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కరోనా బాధితుల ఆహరం కోసం మనిషికి రోజుకు రూ. 500/ కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లాడించారు. అలాగే పనితీరు సరిగాలేని కేంద్రాల బాధ్యులకు క్రమశిక్షణ చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. పటిష్ట చర్యలు చేపట్టాలి అని సూచించారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: