ప్రపంచంలో కరోనా మహమ్మారితో  ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.  ఓ వైపు కరోనాతో నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు ప్రకృతి విపత్తులు కూడా వెంటబడుతున్నాయి. తాజాగా ఉత్తర ఈజిప్టు సముద్రంలో ప్రమాదవశాత్తూ మునిగి 11 మంది మరణించిన విషాద ఘటన వెలుగుచూసింది.అలెగ్జాండ్రియాలో రాతి బీచ్‌లో ఈ ఘటన జరిగింది. ఓ బాలుడు ఆడుకుంటూ అలెగ్జాండ్రియాలోని రాతి బీచ్‌లో వద్దకు వెళ్లాడు.. అంతలోనే అలలు రావడంతో సముద్రంలో పడిపోయాడు. 

 

సముద్రంలో మునిగిపోతున్న బాలుడ్ని రక్షించడానికి మరో యువకుడు దిగడంతో అతను కూడా నీటిలో చిక్కుకుపోయాడు.  వారిద్దరిని  రక్షించడానికి ఏకంగా మరో 9 మంది కాపాడేందుకు సముద్ర నీటిలోకి దిగడంతో వారంతా మునిగి మరణించారని మేజర్ జనరల్ జమాల్ రషద్ చెప్పారు.

 

అత్యవసర బృందాలు ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయని ఈజిప్టు అధికారులు చెప్పారు.  రాత్రి తీరంలోని బీచ్ లో బలమైన ప్రవాహంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ బీచ్ లో ప్రమాదాలు వాటిల్లుతున్న నేపథ్యంలో దీన్ని మూసివేయాలని ఈజిప్టు పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: