ఈ మద్య భారత దేశంపై చైనా, పాకిస్థాన్ వరుసగా కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. వాటిని మన సైనికులు సైతం సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. ఆ మద్య డ్రాగన్లు దొంగ దెబ్బ తీయగా.. 21 మంది జవాన్లు అమరులయ్యారు. ఇక పాకిస్థాన్ బార్డర్ వద్ద వరుస కాల్పుల ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే పోతుంది. దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి.ఉత్తర కశ్మీర్‌లోని నౌగామ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి.

 

కుప్వారా జిల్లా బారాముల్లా సమీపంలని నౌగామ్‌ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ వద్ద శనివారం తెల్లవారు జామున ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను భద్రతా దళాలు గుర్తించాయని ఆర్మీ పీఆర్‌ఓ ప్రకటించారు. భారత సైనికులు కాల్పులు జరుపుతున్న సమయంలో అలర్ట్ అయిన వెంటనే ఎదుర కాల్పులు జరిపారని.. అందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. వారివద్ద రెండు ఏకే 47 తుపాకులు, ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: