తెలంగాణా సచివాలయం కూల్చివేతకు హైకోర్ట్ రెండు రోజుల పాటు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నూతన సచివాలయ నిర్మాణానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నూతన సచివాలయం నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం లో సవాలు చేసారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 

 

ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్‌రెడ్డి సుప్రీం కోర్ట్ ని కోరడం విశేషం. ఆయన దాఖలు చేసిన పిటీషన్ ని సుప్రీం కోర్ట్ విచారణకు స్వీకరించింది. ఈ పిటీషన్ ని సోమవారం సుప్రీంకోర్టు విచారించనుందని తెలుస్తుంది. ఇప్పటికే సచివాలయ భవనాల కూల్చివేత 50 శాతం పూర్తి అయిన నేపధ్యంలో సుప్రీం కోర్ట్ ఏ విధమైన తీర్పు ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: