అసోంలో చైనా ఆర్మీ ఉగ్రవాదులకు ఆయుధాల సహాయం చేస్తుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అస్సాం రైఫిల్స్ & అరుణాచల్ ప్రదేశ్ పోలీసుల ప్రత్యేక బృందం ఈ రోజు తెల్లవారుజామున ఎన్గిను గ్రామానికి సమీపంలో ఉన్న లాంగ్డింగ్ డిస్ట్రిబ్యూట్‌లో తనిఖీలు చేపట్టింది. 

 

ఈ సమయంలో... ఆరుగురు ఎన్‌ఎస్‌సిఎన్ -ఐఎం సాయుధ ఉగ్రవాదులు మరణించారు అని అధికారులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో 1 అస్సాం రైఫిల్ సిబ్బంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 4 ఎకె -47, 2 చైనీస్ ఎంక్యూ  తుపాకులను స్వాధీనం చేసుకున్నామని ఆపరేషన్ జరుగుతుందని అరుణాచల్ ప్రదేశ్ డీజీపీ  ఆర్‌పి ఉపాధ్యాయ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: