ముందు కరోనా కట్టడిలోనే ఉన్నా సరే ఆ తర్వాత మాత్రం చాలా వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో  కర్ణాటక ఒకటి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా పని చేసినా సరే కేసులు మాత్రం ఆ రాష్ట్రంలో భారీగా నమోదు అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ రాష్ట్ర సిఎం ను కూడా కరోనా వైరస్ వేధిస్తుంది. 

 

కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప తన కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది కరోనా వైరస్ బారిన పడటంతో ఆయన కొన్ని రోజులు ఇంటి నుండి విధులు నిర్వర్తించనున్నారని అధికారులు పేర్కొన్నారు. "నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని సిఎం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆ రాష్ట్రంలో ప్రతీ రోజు రెండు వేల కేసులు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: