ఆంధ్రప్రదేశ్ లో సలహాదారుల నియామకం విషయంలో ఇప్పుడు ఏపీ సర్కార్ ని టార్గెట్ గా చేసుకుని విపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని  ఉమా కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేసారు. 

 

ప్రజావేదిక విద్వంసం, 3 రాజధానులు, పెట్టుబడులు వెనక్కి, పోలవరాన్ని పండబెట్టడం, అన్న కాంటీన్ రద్దు, నకిలీ మద్యం, ఇసుక మాఫియా, జె- టాక్స్ వసూళ్లు, సెంటు పట్టా కుంభ కోణం, వైజాగ్ భూదందాలు ఏడాదిలో లక్ష కోట్ల అప్పు. "అభివృద్ధి నిల్-కరప్షన్ ఫుల్" మీ సలహాదారుల రాజ్యంలో ఇచ్చిన సలహాలు ఇవేనా  వైఎస్ జగన్ గారూ అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: