భారత ఆర్ధిక వ్యవస్థపై రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆర్ధిక వ్యవస్థపై కరోనా ప్రభావం తగ్గించే చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. 2019 ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో కోవిడ్-19 వచ్చే వరకు ఆర్బీఐ రెపో రేటును మొత్తం 250 బేసిస్ పాయింట్లు తగ్గించామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

 

ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్స్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. వృద్ధిలో మందగమనాన్ని ఎదుర్కొనేందుకు గానూ ఈ చర్యలు తీసుకున్నట్లు  ఆయన వివరించారు. కోవిడ్-19 ఆరోగ్య, ఆర్థిక రంగాల్లో పెను సంక్షోభం సృష్టించిదని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సంక్షోభాన్ని గత 100 సంవత్సరాల్లో ఎన్నడూ మనం చూడలేదన్నారు ఆయన. ప్రపంచ గమనాన్ని కరోనా వైరస్ మార్చిందని అయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: