దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 27,114 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 519 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటివరకు మొత్తం 8,20,916కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 22,123కి పెరిగింది. 2,83,407 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,15,386 మంది కోలుకున్నారు. ఇక అస్సాంలో కరోనా విజృంభిస్తుంది.

 

జూన్ మాసంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా.. ఈ మద్య లాక్ డౌన్ సడలించిన తర్వాత జూలై మాసంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడం మొదలయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో అస్సాంలో 936 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హేమంత్‌ బిశ్వా తెలియజేశారు. ఒక్క గువాహటి నగరంలోనే 521 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు సమాచారం.

 

దీంతో ఇప్పటివరకు మొత్తం పాజటివ్‌ కేసుల సంఖ్య 15,536కు చేరింది. ఇందులో 5,650 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 9,848 మంది కరోనా బారి నుంచి బయటపడి డిశ్చార్జి అయ్యారు. మొత్తం 35 మంది ఇప్పటివరకు కరోనాతో మృతిచెందారు.  మరోవైపు కరోనా కట్టడి కోసం ఇక్కడ ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: