తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు ఎంత ప్రత్యేకత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉంటుంది బోనాల పండుగ. ఇక బోనాల పండుగ వచ్చిందంటే సందడి వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ప్రస్తుతం కరోనా  వైరస్ దృశ్య బోనాల పండుగను ప్రతి ఒక్కరు తమ ఇంట్లో జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. 

 

 అయితే మొదటి సారి భక్తులు లేకుండా కేవలం ఆలయ అధికారులు పండితుల సమక్షంలోనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను నిర్వహించాల్సి వస్తుంది అంటూ పశు  సంవర్ధక శాఖ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు, తాజాగా సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన ఆయన... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా  ప్రకటించామని..కానీ మొదటిసారి భక్తులు లేకుండా బోనాల పండగ  జరుపుకోవాల్సి వస్తుందని అన్నారు.  బోనాల పండుగ దేశంలోనే అతి పెద్ద పండుగ అంటూ ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: