గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఇంధన ధరల పెంపకం.. భారత్-చైనా సరిహద్దు వివాదం ఇలా పలు అంశాలపై మోదీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా జాతీయ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు.

 

 ప్రస్తుతం కరోనా  వైరస్ విజృంభణ నేపథ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్లను రాజకీయ పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లోక్ సభ ఎంపీ లతో చర్చించారు తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ. అంతే కాకుండా మోదీ  సర్కార్  తీసుకున్న నిర్ణయాలపై పోరాడాల్సిన తీరుపై కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సోనియా గాంధీ.

మరింత సమాచారం తెలుసుకోండి: