ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ కరోనా నియంత్రణకు ఎంతగానో కృషి చేస్తుందని కరోనా ఆసుపత్రిల్లో తక్షణమే సమస్యలను పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఏపీ మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు కలెక్టర్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఆళ్ల నాని... కరోనా వైరస్ రోగులతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు రోగులు తమకు ఆసుపత్రిలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మంత్రి ఆళ్ల నాని కీ వివరించారు.
భోజనంలో నాణ్యత లేదని దుప్పట్లు ఇవ్వడంలేదని మరుగుదొడ్లను శుభ్రం చేయడం లేదు అంటూ మంత్రికి ఫిర్యాదు చేయగా దీనిపై స్పందించిన మంత్రి ఆళ్ల నాని కరోనా రోగుల సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా 18002331077 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు మంత్రి ఆళ్ల నాని.