గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్‌లో ఎప్పుడు మత ఘర్షణలు, కర్ఫ్యూలు ఉండేవని మేయర్ బొంతు రామ్మోహన్ ఆరోపించారు. కేసీఆర్ సీఎం అయ్యాక కర్ఫ్యూ అంటే తెలియకుండా చేశారని ఆయన వ్యాఖ్యానించారు.. ఇప్పుడు కూడా మళ్ళీ మత ఘర్షణలు సృష్టించాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌పై కుట్రల రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలను కోరారు. 

 

కోర్టు తీర్పుకు లోబడి కూల్చివేత పనులు మొదలయ్యాయన్న ఆయన... సచివాలయంలో జరిగిన ఘటనలపై మత పెద్దలతో కూడా మాట్లాడామని ఆయన వివరించారు. మతాల మధ్య చిచ్చు పెట్టొద్దని.. అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన వ్యాఖ్యలు చేసారు. సచివాలయం కూల్చివేతతో మతాలను అవమానపర్చినట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. మోడీ కూడా గుజరాత్ లో ఇలాంటివి చాలా చేసారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: