మధ్యప్రదేశ్ లో రేవా ఆల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడంపై కర్ణాటక కాంగ్రెస్ అధినేత డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. కర్ణాటకలో 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఉందని ఆయన చెప్పారు.

 

 రేవాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఆసియాలోనే అతి పెద్ద ప్లాంటని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రకటించిందన్న ఆయన... మరి కర్ణాటకలోని పవగడలో 2000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ మాటేమిటి? అని కేంద్రాన్ని నిలదీశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3 ఏళ్లలో దాన్ని నిర్మించిందని ఆయన పేర్కొన్నారు. 2018 నుంచి పని చేస్తోంది అంటూ ఆయన ఒక  పోస్ట్ చేసారు సోషల్ మీడియాలో. పవగడలోని సోలార్ ప్రాజెక్టుకు మరో ప్రత్యేకత కూడా ఉందన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: