భారత్ లో కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి ఇప్పుడు ప్రచార౦ కాస్త ఎక్కువగా జరుగుతుంది. కరోనా వ్యాక్సిన్ ని తాము కనుక్కుంటామని... త్వ‌ర‌లోనే మార్కెట్లో ప్రవేశ పెడతామని అంటూ ఐసిఎంఆర్ ఒక డేట్ ని కూడా ప్రకటించింది. ఈ డేట్ పై సర్వత్రా విమర్శలు వచ్చాయి.  అయితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ విషయంలో కాస్త దూకుడుగానే అడుగులు వేస్తున్నారు. 

 

ఇక నుంచి కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ఆధారంగా ఇతర దేశాల సహకారం తీసుకోవాలని భారత్ భావిస్తుంది. విదేశాలు కూడా కరోనా  వ్యాక్సిన్ ని కనుక్కొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలో బ్రిటన్ లేదా ఇటలీ  సహాయం తీసుకోవడం మంచిది అని కేంద్రం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది నిజ‌మైతే క‌రోనా వ్యాక్సిన్ త్వ‌ర‌గా మ‌న‌దేశంలోకి రావ‌డంలో సంచ‌ల‌న నిర్ణ‌యం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: