కరోనా కట్టడిలో చాలా వరకు సమర్ధవంతంగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. అక్కడ కరోనా కేసులను దాదాపుగా కట్టడి చేస్తుంది అక్కడి సర్కార్. ఇక తాజాగా అసలు అక్కడ కేసులు ఏమీ నమోదు కాలేదు. పదుల సంఖ్యలో కేసులు రాగా ఇప్పుడు ఏకంగా సింగిల్ డిజిట్ కి వచ్చాయి. 

 

అక్కడి నుంచి భారీగా పడిపోయి జీరో కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. హిమాచల్ ప్రదేశ్లో ఈ రోజు ఒకరు కోలుకున్నారు అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 1171 వద్ద ఉందని ప్రభుత్వం తెలిపింది. వీటిలో 274 క్రియాశీల కేసులు, 873 మంది కోలుకోగా 9 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: