దేశ వ్యాప్తంగా ఇప్పుడు చైనా సర్కార్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో చైనా ఆర్మీ పెట్టే చిచ్చు ఇప్పుడు దీర్ఘకాలిక ప్రభావాలు చూపిస్తుంది అంటూ రక్షణ రంగ నిపుణులతో పాటుగా వ్యాపార రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు చైనాకు చెందిన కొన్ని యాప్స్ ని నిషేధించింది కేంద్రం.

 

ఈ తరుణంలో కొన్ని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. భారత్ లో ఎక్కువగా వినియోగంలో ఉన్న చైనా కంపెనీలు అవసరం అయితే  తమ మాతృ సంస్థల కేంద్రాలను చైనా నుంచి తరలించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. టిక్ టాక్ ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా మరికొన్ని కంపెనీలు కూడా అదే బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయి. అదే జ‌రిగితే చైనాకు అదిరిపోయే షాక్ అనుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: