కరోనా పుణ్యమా అని కేంద్రం వర్సెస్ తెలంగాణా సర్కార్ గా మారిపోయింది. తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. రైతాంగానికి కేంద్రం ఏం చేసింది..? అంటూ ఆయన కేంద్రాన్ని నిలదీశారు. వేల కోట్లు ఎగ్గొట్టే వ్యాపారుల పట్లే కేంద్రానికి ప్రేమ ఉందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మట్టిని నమ్ముకున్న రైతుల పట్ల ప్రేమ లేదన్నారు ఆయన... 

 

రైతాంగం గగ్గోలు పెడుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికీ కేంద్రాన్ని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. కేంద్రం చేస్తే ఓకే లేకుంటే ఏదో ఒకరోజు కేసీఆరే చేస్తారు అంటూ ఆయన మండిపడ్డారు. భవిష్యత్‌లో దేశ రైతాంగానికి కేసీఆరే దిక్సూచి అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రంలో కేసీఆర్ ఏంటనేది రైతులే నిర్ణయిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: