సాధారణంగా కింగ్ కోబ్రా అంటే ఎంత ఉంటుంది...? మనం చూసిన వాటి ప్రకారం ఒక పది నుంచి 12 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇక రియల్ గా అవి చూడటం చాలా కష్టమే గాని ఎక్కడో అటవీ ప్రాంతాలు ఉన్న  దగ్గరనే మనకు తరుచుగా కనపడుతూ ఉంటాయి అనే సంగతి తెలిసిందే.  ఏ యుట్యూబ్ లోనో సోషల్ మీడియాలోనో చూస్తూ ఉంటాం. 

 

తాజాగా తమిళనాడు లోని కోయంబత్తూరు సమీపంలో ఒక పెద్ద కింగ్ కోబ్రా కనపడింది. కోయంబత్తూరులోని తోండముత్తూరులోని నరసిపురం గ్రామంలో 15 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. తరువాత దీనిని సిరువాని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. ఇక దాన్ని చూసి స్థానిక ప్రజలు కాస్త కంగారు పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: