భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత  ఆర్మీ మీద ఉగ్రవాదులు దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయి అని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిఘా వర్గాలు తాజాగా కీలక హెచ్చరికలు భారత ఆర్మీ కి చేసాయి. జమ్మూ & కాశ్మీర్ రీజియన్  లోని 2 కంపెనీల భారత భద్రతా దళాలపై పాకిస్తాన్ బాట్... బోర్డర్ యాక్షన్ టీం (బ్యాట్) దాడులు ఉంటాయి అని హెచ్చరించింది. 

 

సైనికులు పాకిస్తాన్ ఆర్మీ కలిసి ఈ బ్యాట్ దళాలుగా ఏర్పడ్డారు. వీరు భారత సైనికులను అపహరించి సరిహద్దుల్లో తల నరకడం సహా కొన్ని చర్యలకు గత కొన్నాళ్ళ నుంచి పాల్పడుతూ వస్తున్నారు. వారి మీద నిఘా వర్గాలు ప్రత్యేకంగా ఫోకస్ చేసాయి. కాగా సరిహద్దుల్లో 300 మంది ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉందని ఆర్మీ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: