ఝార్ఖండ్ లో కరోనా కేసులు తక్కువగానే ఉన్నా అక్కడి సిఎం కార్యాలయాన్ని కరోనా తాకడం పై ఆందోళన కాస్త వ్యక్తమైంది. కరోనా కేసులు  సిఎం ఆఫీస్ లో నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆ రాష్ట్ర యువ సిఎం హేమంత్ సోరెన్ ఇటీవల  క్వారంటైన్ కి కూడా వెళ్ళారు. ఆయన దాదాపు వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లోనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయనకు కరోనా పరిక్షలు నిర్వహించారు అధికారులు. 

 

ఆయనకు దగ్గరగా ఉండే కీలక అధికారులకు కరోనా రావడంతో ఆయనకు కరోనా పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగటివ్ వచ్చింది అని సిఎం కార్యాలయం కాసేపటి క్రితం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సిఎం ఆఫీసుని మూసి వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: