గుంటూరు జిల్లాను కరోనా వేధిస్తూనే ఉంది. కరోనా కేసులు గుంటూరు జిల్లాలో ప్రతీ రోజు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు ప్రతీ రోజు కూడా వంద కేసులకు పైగా గుంటూరు జిల్లాలో వస్తున్నాయి అంటే కేసుల తీవ్రత ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి జిల్లా యంత్రాంగం ఎంత సమర్ధవంతంగా ఉన్నా సరే ఫలితం ఉండటం లేదు. 

 

ఇక నేడు కూడా అక్కడ భారీగా కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 155 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  గుంటూరు సిటీ ప‌రిధిలో 49 కేసులు రాగా... మంగళగిరి లో 43, నరసరావుపేటలో 21, తాడేపల్లిలో 10 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి అని హెల్త్ బులిటెన్ లో ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: