కరోనా వైరస్ తో తమిళనాడు అల్లాడిపోతుంది. అక్కడ రోజు రోజుకి కరోనా కేసులు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. మరణాలు కూడా ప్రతీ రోజు రాష్ట్రంలో పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి అక్కడ లాక్ డౌన్ ని అమలు చేస్తున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే తమిళనాడులో 69 మరణాలు ఒక్క రోజే నమోదు అయ్యాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. 3,965 కొత్త కరోనా కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి. 

 

3,591 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1,34,226 గా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వీటిలో 46,410 క్రియాశీల కేసులు ఉన్నాయి. మొత్తం 1,898 మంది కరోనా బారిన పడి మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: