రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఎవరున్నా వెంటనే గుర్తించి చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని అధికారులను తెలంగాణా సిఎం కేసీఆర్ ఆదేశించారు. తాజాగా ఆయన వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వంద శాతం నియంత్రిత పద్దతిలో ఈ వానా కాలం పంట సాగు చేయడం మంచి పరిణామం అని అన్నారు. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని ఆయన పేర్కొన్నారు. సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు గానూ రూ.25 కోట్లతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్‌ కోల్డ్‌ స్టోరేజి నిర్మించనున్నట్లు ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: