మహారాష్ట్రలో కరోనా కేసులు ఏ మాత్రం అఆగడం లేదు. కరోనా అక్కడ తీవ్ర స్థాయిలో రెచ్చిపోతుంది. ప్రతీ రోజు వేల కేసులు ఆ రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహారాష్ట్రలో ఈ రోజు 8,139 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 4,360 మంది నేడు డిశ్చార్జ్ అయ్యారు. 

 

రాష్ట్ర వ్యాప్తంగా 223 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 2,46,600 గా ఉందని రాష్ట్ర  ప్రభుత్వం పేర్కొంది. వీటిలో 99,202 క్రియాశీల కేసులు ఉన్నాయి. 1,36,985 మంది డిశ్చార్జ్ అయ్యారు. 10,116 మంది కరోనా బారిన పడి రాష్ట్రంలో మరణించారు. ఇక ధారావీ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో పూణే జిల్లా సహా కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ కఠినం గా అమలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: