భారతదేశంలో 2018లో చేపట్టిన పులుల గణన... ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వన్యప్రాణుల సర్వేగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది.గతేడాది ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఆల్​ ఇండియా టైగర్ ఎస్టిమేషన్​ 2018 నాలుగో విడత గణాంకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీని ప్రకారం, భారత్​లో 2,967 పులులు ఉన్నాయి.

 

 అంటే ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75 శాతం భారత్​లోనే ఉన్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో... పులుల సంఖ్యను రెట్టింపు చేయాలనే 'సంకల్ప్ సే సిద్ధి' లక్ష్యాన్ని నాలుగేళ్ల ముందే చేరుకున్నట్లు జావడేకర్ పేర్కొన్నారు.ఈ కెమెరా ట్రాప్​ వల్ల మొత్తంగా.. 3,48,58,623 వన్యజీవుల చిత్రాలను సేకరించగలిగారు. ఈ ఫొటోల్లో 76,651 పులులు, 51,777 చిరుతపులులు, మిగిలినవి ఇతర జీవులు. ఈ సాఫ్ట్​వేర్​ ద్వారా మొత్తంగా 2,461 పులులను (కూనలు మినహాయిస్తే) గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: