కజఖిస్థాన్​లో ఇటీవల బయటపడిన గుర్తుతెలియని న్యుమోనియా సంబంధిత వ్యాధి కరోనానే అయి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. కొవిడ్​-19 వల్లే ఆ వ్యాధి వ్యాప్తి చెంది ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర విభాగం చీఫ్​ డా. మిచెల్​ ర్యాన్​.

 

 

కొత్త వ్యాధి సోకిన వారి ఎక్స్-​రేలు పునఃసమీక్షించటం, న్యూమోనియా కేసుల్లో కరోనా లక్షణాలను పరిశీలించేందుకు స్థానిక అధికారులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పని చేస్తున్నట్లు చెప్పారు ర్యాన్​. అలాంటి కేసుల్లో చాలా వరకు కొవిడ్​-19గా నిర్ధరణ అవుతాయని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే డబ్ల్యూహెచ్​ఓ బృందం కజఖిస్థాన్​ చేరుకున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: