భారత్​-చైనా మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణ గురించి ట్రంప్​నకు ఏమీ తెలియదని బోల్టన్ పేర్కొన్నారు. 'బహుశా చైనాతో భౌగోళిక వ్యూహాత్మక సంబంధం గురించి ట్రంప్ ఆలోచిస్తున్నారని అనుకుంటున్నా. ముఖ్యంగా వాణిజ్యం విషయంలో'... అని జాన్ బోల్టన్​ పేర్కొన్నారు.జాన్ బోల్టన్ 2018 ఏప్రిల్ నుంచి 2019 సెప్టెంబర్​ వరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు.

 

చైనా విస్తరణవాదంతో హద్దుమీరి ప్రవర్తిస్తోందని జాన్​ బోల్టన్ విమర్శించారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలపై, వాటిలోని చిన్న చిన్న ద్వీపాలపై ఆధిపత్యం చెలాయించాలని డ్రాగన్ ప్రయత్నిస్తోందని అన్నారు. ఫలితంగా జపాన్​, భారత్​తో సహా ఇరుగుపొరుగు దేశాలతో డ్రాగన్ ద్వైపాక్షిక సంబంధాలు బాగా క్షీణించాయని బోల్టన్​ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: