బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ కరోనా సోకడం తో ఒక్కసారిగా సినీ ప్రపంచం షాక్ అయింది. ఎంతో జాగ్రత్తగా ఉండే ఆయనకు కరోనా సోకడం విదేశాల్లో కూడా సంచలనంగా మారింది. ఇక ఆయనను ముంబై నానా వతీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు వైద్యులు.  ఆయన ఆరోగ్యంపై తాజాగా వైద్యులు స్పందించారు. 

 

అమితాబ్ బచ్చన్ తేలికపాటి లక్షణాలతో స్థిరంగా ఉన్నారు అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసోలేషన్ విభాగంలో చేరారు అని.. నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఒకరు మీడియాకు వివరించారు. ఆయన కుటుంబం మొత్తం ఇప్పుడు  హోం క్వారంటైన్ లో ఉంది.  ఆయన ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని చెప్తుంది ఆయన కుటుంబం.

మరింత సమాచారం తెలుసుకోండి: