అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత పెరగడమే గాని తగ్గే అవకాశాలు ఏ విధంగా కూడా కనపడటం లేదు. రోజు రోజుకి అక్కడ కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా వ్యవహరించినా సరే కరోనా తీవ్రత మాత్రం ఆగడం లేదు. అయితే అక్కడి ప్రజలు మాత్రం కరోనాకు ఏ మాత్రం భయపడటం లేదు. 

 

ఇదిలా ఉంటే... 66,528 రోజువారి కేసులు నమోదు అవుతున్నాయి. యావరేజ్ గా అక్కడ అన్ని కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు 40 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. ఇక అక్కడ కరోనా మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని ఈ నెలలో అక్కడ కోటి కేసుల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: